నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో ఆర్ & బి బంగ్లా నందు పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ పంపిణీ
ఏ పి. ఇ. ఆర్. యూ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ పంపిణీ
పిడుగురాళ్ల :–
దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ, భూలోకంలో మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట!
ఈ వేసవికాలంలో భగభగ మండుతున్న ఎండలకు గొంతులో కాసిన్ని మంచినీళ్లు పడితే ప్రాణం కాస్త కుదుట పడుతుంది.మరి అలాగే చల్లని మజ్జిగ తాగితే మరింత ఉపశమనం కలుగుతుందని భావించిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా వారు సేవా దృక్పథంతో పిడుగురాళ్ల ఆర్ & బి బంగ్లా నందు, పట్టణ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఒక్కరికి మజ్జిగ అందించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ (ఇంచార్జ్ )వి. సురేష్ నాయక్, మరియు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ పిల్లి. యజ్ఞ నారాయణ , ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు వి.లక్ష్మణ్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కుమార్, కోశాధికారి వెంకటేశ్వర్లు,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గణేష్, అశోక్, ఓ రమాదేవి సచివాలయం మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







