నారద వర్తమాన సమాచారం
ఏ పి ఎం, లకు,సి సి,లకు యాన్యువల్ క్రెడిట్ లైవ్లీ హుడ్ ప్లాన్ సంబంధించి శిక్షణ ఇచ్చిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి
నరసరావుపేట:-
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఝాన్సీరాణి ఆధ్వర్యంలో కోటప్పకొండ లోని టి టి డి సి సమావేశ మందిరంలో జిల్లా లోని అందరూ ఏ పి ఎం లకు,సి సి లకు యాన్యువల్ క్రెడిట్ లైవ్లీ హుడ్ ప్లాన్ ( ఏ బి సి ఎల్ పి ) 2025-26 కి సంబంధించి జిల్లాలో 36500 స్వయం సహాయక సంఘాలకు సభ్యుల అవసరాలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెంపొందించుట కొరకు సిబ్బందికి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి శిక్షణ ఇచ్చారు.తదుపరి సిబ్బంది అందరూ కలిసి మీ మండల స్థాయిలో గ్రామ సమాఖ్య అధ్యక్షులకు,గ్రామ సమాఖ్య అసిస్టెంట్ లకు శిక్షణ ఇచ్చి వారి అవసరాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవనోపాధులు పెంచుకొనుటకు,వారికి ఎంత వరకు రుణం కావాలో క్రెడిట్ ప్లాన్ తయారు చేసుకొని బ్యాంకు లింకేజ్,స్త్రీ నిది,ఉన్నతి మరియు స్వంత నిధులు( పొదుపు) నుండి జీవనోపాధులు పెంచుకొనుటకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ జిల్లా అధికారి రమణా రెడ్డి మాట్లాడుతూ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లు తయారు చేయుటకు డి ఆర్ పి లను ఉపయోగించుకొని లక్ష్యాలను చేరుకునేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి పి ఎం లు,స్త్రీ నిది ఏ జి ఎం,జిల్లా యాంకర్ పర్సన్ లు, ఏ పి ఎం లు,సి సి లు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.