నారద వర్తమాన సమాచారం
భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాకిస్థాన్ యత్నం!
ఆపరేషన్ సిందూర్‌తో పహల్గామ్ ఘటనపై భారత్ ప్రతీకారం తీసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది.
ఈ దాడుల్లో దాదాపు 100 మంది చనిపోయారు. చనిపోయినవారిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్నారు. భారత్ ఉగ్రస్థావరాలపై దాడులు చేయడంతో పాకిస్థాన్ రెచ్చిపోతుంది. భారత్ పై ఎప్పుడు ఎలా దాడి చేయాలా అని ప్లాన్ చేస్తుంది. బుధవారం రాత్రి ఏకంగా 15 నగరాల్లోని ఆర్మీ స్థావరాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది.
చైనాకు చెందిన బీవీఆర్ మిసైల్స్‌తో పాక్ దాడి చేసేందుకు ప్రయత్నించగా భారత్ ఎస్400 ఎయిర్ డిఫెన్స్‌తో దానిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. బటిండా, జమ్మూశ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్, లుథియానా, జలంధర్, భుజ్, అవంతిపుర, చండీగఢ్, ఫలోడితో పాటూ పలు నగరాలపై దాడులకు పాల్పడింది. భారత సైన్యం అడ్డుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. మరోవైపు సరిహద్దుల్లో కూడా పాక్ నిరంతరం కాల్పులు జరుపుతూనే ఉంది. వాటిని భారత సైన్యం తిప్పికొడుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.