నారద వర్తమాన సమాచారం
కారంపూడి
పేట సన్నీ గండ్ల గ్రామ శివారులో సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు
కారంపూడి మండలంలోని పేట సన్నిగండ్ల గ్రామ శివారులోని సింగరుట్ల లో వేంచేసి ఉన్న లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలను ఆదివారం వ్యవస్థాపక ధర్మకర్త గుండాల. శ్రీనివాసరావు, కార్యనిర్వహణ అధికారి చపారపు. శివ నాగిరెడ్డి మరియు గ్రామ ప్రజలు, పెద్దల సహకారంతో రేపు ఘనంగా నిర్వహించనున్నారు. సింగరుట్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు నరసింహస్వామి హోమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కళ్యాణ మహోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం దేవాలయంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 7గంటల నుండి సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణ మహోత్సవం వేడుకల్లో మండలంలోని ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారి కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.