నారద వర్తమాన సమాచారం
మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లో ఎదురు కాల్పులు
మహారాష్ట్ర – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీస్ స్పెషల్ కమాండో సీ-60 సి ఆర్ పి ఎఫ్, సంయుక్తంగా గడ్చిరోలి, జిల్లాలో ఆపరేషన్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.
కవండే ప్రాంతంలో బేస్ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం ఆధారంగా ప్రవారము ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందిన విశ్వసనీయ నిఘా ఆధారంగా, అదనపు ఎస్పీ రమేష్ మరియు 12 సీ60 పార్టీలు (300 కమాండోలు సీఆర్‌పీఎఫ్ నేతృత్వంలోని ఒక ఆపరేషన్ గురువారం నుంచి ప్రారంభించారు.
కవాండే , నెల్గుండ నుండి ఇంద్రావతి ఒడ్డు వైపు భారీ వర్షం కురుస్తున్న సమయం లో సెర్చ్ ఆపరేషన్ మొద లుపెట్టారు.శుక్రవారం ఉదయం కార్డన్ వేసి నది ఒడ్డున సోదాలు చేస్తుం డగా, మావోయిస్టులు సీ60 కమాండోలపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు,
దీంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. దాదాపు రెండు గంటల పాటు అడపాదడపా కాల్పులు కొనసాగాయి. ఈ ప్రాంతంలో పోలీసుల జరిపిన సోదాల్లో నలుగురు మావోయిస్టుల మృతదే హాలు, ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు .303 రైఫిల్ మరియు ఒక భార్మర్ ను స్వాధీనం చేసుకున్నారు.
దీనితో పాటు, వాకీ టాకీలు, క్యాంపింగ్ సామగ్రి, నక్సల్ సాహిత్యం మొదలైనవి సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.