నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి లో కిషోరి సమ్మర్ క్యాంపెయిన్ నిర్వహించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి
దాచేపల్లి :-
ది. 23.5.2025న నారాయణపురం గ్రామం, నడికుడి 3 సచివాలయం, దాచేపల్లి నందు జరిగిన కిషోరి వికాసం సమ్మర్ క్యాంప్, సెషన్-7 కార్యక్రమంలో విద్యా మరియు ఓపెన్ స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి కిషోరి బాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ బాలికలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని, జీవితంలో ధైర్యంగా ఎదగాలని, ఉన్నత విద్యను అభ్యసించి తన కాళ్లపై తాను నిలబడాలని, బాల్య వివాహం చేసుకోకూడదని, ఆర్థిక స్తోమత లేని వారికి హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు. తరువాత మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి ఉమాదేవి డిసిపిఓ శౌరి రాజు కిషోరి బాలికల రక్తహీనతకు గురికాకుండా మంచి పోషకాహారం తీసుకోవాలని, ముక్యంగా బాలల అక్రమ రవాణకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని మరియు బాలల హక్కుల గురించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ ఎం వి అప్పారావు ఎంపీడీవో రవికుమార్ ఆస్ఐ శరత్ గురజాల ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇన్చార్జి సిడిపిఓ అరుణ ఎసిడిపిఓ నిర్మల నడికుడి సెక్టార్ సూపర్వైజర్ వరలక్ష్మి, ఎం ఎస్ కే రత్నము మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
తదనంతరం అదే రోజు సాయంత్రం అనగా 23.5.2025న శ్రీమతి పద్మావతి బాలికా సదన్, పిడుగురాళ్ల సందర్శించి వారు నిర్వహించుచున్న పలు రికార్డులు పరిశీలించి తగు సూచనలు చేసి ఉన్నారు.
మరియు పిల్లలకి అందించుచున్న ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించినారు, మరియు బాలిక సదనంలో ప్రతి కార్యక్రమం పిల్లల హక్కుల చట్టాలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించి ఉన్నారు. అడాప్షన్కు ఉన్న పిల్లల్ని త్వరతగతిన అడాప్షన్ ప్రాసెస్లో పెట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కోతుల, కుక్కల కాటునుండి పిల్లల్ని రక్షించాలని యానిమల్ ఆక్ట్ ప్రకారం కోతులు, కుక్కలను అడివిలో వదిలిపెట్టాలని మునిసిపల్ కమీషనర్ను ఆదేశించారు. బాలికా సదన్లో స్టాక్ ఎక్కువుగా ఉన్నందున 50 కేజీలు మాత్రమే ఉంచి మిగిలిన స్టాక్ను ఎమ్ ఆర్ ఓ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆదేశించారు. బాలికా సదన్లో ఉన్న బాలికలకు కేసుస్టడీ రిపోర్ట్, ఇండివిడ్యుల్ కేర్ ప్లాన్స్, హెల్త్ రికార్డ్స్, బాలల న్యాయ (ఆదరణ & రక్షణ) చట్టం -2015 మరియు బాలల న్యాయ (ఆదరణ & రక్షణ), 2016 & 2023 నిబంధనలు అనుసరించి ఉండాలని అధికారులను ఆదేశించారు. మిషన్ వాత్సల్య గైడ్లైన్స్ అనుసరించి స్పాన్సర్షిప్కి అర్హత ఉన్న పిల్లల్ని పెట్టించాలని ఐసిడియస్ & ఐసిపియస్ అధికారులను ఆదేశించారు. అలానే బాలలకు అధార్లు మరియు జనన ధ్రువ పత్రాలు లేని వారికి ఇప్పించాలని మునిసిపల్ కమిషనర్, ఎంపిడిఓ వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి ఉమాదేవి డిసిపిఓ శౌరి రాజు సిడిపిఓ లు, ఐసిడిస్ సూపర్వైజర్లు మరియు బాలిక సదన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.