నారద వర్తమాన సమాచారం
యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి..
క్యూఆర్ కోడ్ లేదా వెబ్ సైట్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి..
జిల్లా కలెక్టరు పి.అరుణ్ బాబు
జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా ప్రజలందరి భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలని జిల్లా కలెక్టరు పి.అరుణ్ బాబు విజ్ఞప్తి చేశారు. గ్రామ, మండల, జిల్లాస్ధాయిలో యోగాంధ్ర పోటీలను నిర్వహించాలన్నారు.ఆయా శాఖల వారీగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోయోగా స్ట్రీట్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అదే విధంగా యోగాంధ్ర ప్రాధాన్యతను తెలిపే విధంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలని సూచించారు. జూన్ 21వ తేదీన మీ సమీపాన ఉన్న గ్రామ, వార్డుల ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాల వద్ద పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలనే ధ్యేయంతో క్యూ ఆర్ కోడ్ లేదా వెబ్ సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ నమోదు కావాలని జిల్లా కలెక్టరు తెలిపారు. ఇంటర్నేషనల్ యోగలో పాల్గొనేందుకు లింకు ద్వారా నమోదు కావాలని సూచించారు. https://yogandhra.ap.gov.in/#/home/launchone ముందుగా పై లింక్ ఓపెన్ చేయాలని ,తదుపరి స్క్రీన్ లో కింద ఉన్న లాంచ్ క్లిక్ చేయాలని, తదుపరి స్క్రీన్ లో పైన ఉన్న రిజిస్టర్ క్లిక్ చేయాలన్నారు. తదుపరి స్క్రీన్ లో ఈ క్రింది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, చివరగా ఓటీపీతో కన్ఫర్మ్ చేయాలని వివరించారు. నమోదుకు మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు,పుట్టిన తేదీ, చిరునామాలను పొందుపరచాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.