నారద వర్తమాన సమాచారం
ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పనిచేస్తాయి,: మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ సరుకుల పంపిణీ విధానములో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది,జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టాం అని, రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ న్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయు క్తంగా ప్రజల కోసం పని చేస్తున్నాయని చెప్పారు.
మార్కెట్‌లో ధరల పెరుగు దల ఉంటే.. సబ్సిడీపై రేషన్ షాపుల ద్వారా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు పని చేస్తాయని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వా రా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుతం అన్ని ఏర్పాట్లు చేసింది.
దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ మధురా నగర్ లోని 218 రేషన్ షాపులో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించా రు. మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు. ఈపోస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటా పని తీరును దగ్గరుండి మరీ చెక్ చేశారు.
ఈకేవైసీ 96 శాతం పూర్తి చేశాం.. దేశంలోనే ఇది ఒక రికార్డు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి స్వస్తి పలికాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజల కోసం పని చేస్తు న్నాయి’ అని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.