నారద వర్తమాన సమాచారం
యోగాంధ్ర పోటీలకు ఆహ్వానం
- గ్రామ/వార్డు, మండల, జిల్లాస్థాయిలో పోటీల నిర్వహణ
- జూనియర్, యంగ్, సీనియర్ గ్రూప్ కేటగిరీల్లో పోటీలు
- జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గ్రామ/వార్డు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరగనున్నాయని.. గ్రామస్థాయి విజేతలు మండల స్థాయికి, మండలస్థాయి విజేతలు జిల్లాస్థాయికి, జిల్లాస్థాయి విజేతలు రాష్ట్రస్థాయికి అర్హత సాధిస్తారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆసనాల ప్రదర్శన (సూర్య నమస్కార్ ఛాలెంజ్, ప్రాణాయామం, మెడిటేషన్), ఆర్టిస్టిక్ యోగా (యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, రోల్‌ప్లే), వైజ్ఞానికి యోగా (యోగా క్విజ్, యోగా పోస్టర్, యోగా స్లోగన్, యోగా ఎస్సే), యోగా షార్ట్‌ఫిల్మ్, యోగా ఫొటోగ్రఫీలో పోటీలు జరుగుతాయని, గ్రూప్ విభాగంలో సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, మిక్స్‌డ్ ఏజ్ గ్రూప్ యోగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూనియర్ గ్రూప్ (10-18 ఏళ్లు), యంగ్ గ్రూప్ (19-35 ఏళ్లు), సీనియర్ గ్రూప్ (35 ఏళ్లు, ఆపైన) కేటగిరీల్లో పోటీలు జరుగుతాయన్నారు. యోగా పోస్టర్, యోగా స్లోగన్, యోగా షార్ట్‌ఫిల్మ్, యోగా ఫొటోగ్రఫీ విభాగాల్లో పోటీపడాలనుకునే ఔత్సాహికులు తమ ఎంట్రీలను జూన్ 10వ తేదీలోగా 9440611107 (డా. ఆర్.శ్రీనివాస్) నంబరులో సంప్రదించవచ్చని సూచించారు. వివిధ పోటీల్లో విజేతలకు అవార్డుల ప్రదానం ఉంటుందని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.