నారద వర్తమాన సమాచారం
భారత్ లో నాలుగువేలకు పైగా కోవిడ్ కేసులు ! ఐదుగురి మృతి !
కోవిడ్-19 భారత్ లో చాపకింద నీరులా వస్తరిస్తోంది. ఇది కోవిడ్ పాండమిక్ కాదు… ఎండమిక్ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే దేశ ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.
భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. ప్రస్తుతం భారత్ నాలుగు వేల ఇరవై ఆరు కేసులు ఉన్నట్లు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అంతేకాదు తాజాగా ఐదుగురు కోవిడ్‌తో మృతి చెందినట్లు స్పష్టం చేసింది.
కోవిడ్ తో మహారాష్ట్రలో ఇద్దరు, తమిళనాడు, యూపీ, కేరళలలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. కేరళలో అత్యధికంగా 1416 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధికంగా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మహారాష్ట్రలో 494 కేసులు నమోదయ్యాయి ఇక గుజరాత్ లో 397, ఢిల్లీలో 393 కేసులు, తమిళనాడులో 215 కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో 28 కేసులో వెలుగు చూడగా, తెలంగాణలో 4 కోవిడ్ కేసులు ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా కర్ణాటకలో, హర్యానా, తమిళనాడు, గుజరాత్ లలో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. అయితే భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుదలకు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్ కోరలు ఇంకా సజీవంగా ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ సోకిన వారిలో కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.