నారద వర్తమాన సమాచారం
ఉప్పలపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్
భుదవారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు వెల్దుర్తి మండలం, ఉప్పలపాడు గ్రామంలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖి చేసారు. ప్రాధమిక కేంద్రములో గల ఆన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రోజూ ఎంత మంది పేషెంట్లు వస్తున్నారు, వారికి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.పి.హెచ్,సి.లో ఉన్న ల్యాబ్ లో ఆన్ని పరిక్షలు చేస్తున్నారా , సిబ్బంది సకాలములో ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారా వివరాలు సేకరించారు. రిజిష్టరు లు పరిశీలించారు. అదేవిధముగా హాజరు పట్టిక రిజిష్టరును పరిశీలించారు. ఈ.హెచ్.ఆర్ ( ఎంప్లాయీస్ హెల్త్ రికార్డ్స్) ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్నారా, త్వరిత గతిన పూర్తీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.వి.రవి, పి.హెచ్.సి. సిబ్బంది తదితరులు పాల్గొనారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.