నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాను సారా రైతు జిల్లాగా ప్రకటించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
పల్నాడు జిల్లాను సారా రహిత జిల్లా గా జిల్లా కలెక్టర్ P. అరుణ్ బాబు గారు, I.A.S ప్రకటించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ వారి వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల మరియు ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించినారు. తొలుత జిల్లాలో ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు నాటు సారా నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎక్సైజ్ అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవోదయం 2.0 కార్యక్రమంలో బాగంగా జిల్లాలో నాటు సారా నిర్మూలనకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
పల్నాడు జిల్లాలో నవోదయం కార్యక్రమం ప్రారంబించిన నాటికి, (4) స్టేషన్ల (నరసరావుపేట, క్రోసూరు, మాచర్ల, ఈపూరు) పరిధిలో 28 గ్రామాలలో నాటు సారా గుర్తించగా, అందులో 12 “A” కేటగిరీ గ్రామాలు, 6 “B” కేటగిరీ గ్రామాలు మరియు 10 “C” ” కేటగిరీ గ్రామాలు వున్నాయి. నాటు సారా నిర్మూలన లో భాగంగా మొదటి దశలో 116 అవగాహన సదస్సులు నిర్వహించటతో పాటు, నాటు సారావలన కలుగు దుష్ప్రభావాలపై ప్రచార రథంపై ఊరురా తిరుగుతూ ప్రచారం నిర్వహించటమైనది. నాటు సారా నిర్మూలనలో భాగంగా రెండవ దశలో విస్తృతంగా దాడులు నిర్వహించి సారా తయారీ విక్రయాల్లో ఉన్న వారిపై (32) కేసులు నమోదు చేసి, (21) మందిని అరెస్టు చేయగా, (138) లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు, (11,400) లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినారు మరియు ఐదు బెల్లం ఊట కేసులలో ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేసినారు. నవోదయం 2.O లో భాగంగా (19) పాత సారా కేసులలో ఉన్న ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. అవి నరసరావుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిదిలో (08) మంది ముద్దాయిలు, క్రోసూరు ఎక్సైజ్ స్టేషన్ పరిదిలో (01) ముద్దాయి, మాచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిదిలో (10) ముద్దాయిలను అరెస్టు చేసినారు. గత నాలుగు సంవత్సరముల నుండి పాత కేసుల్లో ఉన్న (150) మంది ముద్దాయిలను మరియు (30) మందిని అనుమానితులను గుర్తించి వారిపై నిగా పెట్టినారు మరియు నవోదయంలో భాగంగా (123) మంది ముద్దాయిలను సత్ప్రవర్తన క్రింద U/s 129 BNSS ప్రకారం తాసిల్దార్ కార్యాలయాల్లో బైండ్ ఓవర్ చేసినారు. ప్రస్తుతము మొత్తము నాటు సారాలో (160) మంది బైండ్ ఓవర్లు అమల్లో ఉన్నవి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు కొత్త పుల్లారెడ్డిగూడెం, మోరసపెంట, హసనాబాద్ తండా మరియు చింతల తండాలలో పోలీసు వారితో పాటు సారా పై దాడులు నిర్వహించి కార్డెన్ సర్చ్ చేసినారు. నిరంతర నాటు సారా సంబంధిత గ్రామాల్లో మరియు అటవీ ప్రాంతాలలో డ్రోన్ సాయంతో నిరంతర నిఘా పెట్టినారు. బెల్లం వ్యాపారులందరికీ నోటీసులు ఇచ్చినారు, ముద్దాయిలు వివరాలు ఇచ్చి వారికి బెల్లం అమ్మ వద్దని తెలియజేసినారు. మరియు నాటు సారా తయారీలో ఉన్నవారికి బెల్లం సరఫరా చేసిన ఒక బెల్లం వ్యాపారిని అరెస్టు చేసినారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో నాటు సారా వృత్తిగా బ్రతుకుతున్నా వారికి చైతన్యం కల్పించి ప్రత్యన్మయముగా ఉపాధి కల్పించటకు కలెక్టర్ సూచనల ప్రకారం (57) మందిని గుర్తించి అందులో అర్హుల అందరిని ధ్రువీకరించి DRDA వారి సహకారంతో (23) మందికి ప్రత్యామ్నాయ గా వారి కుటుంబాలకు 29,40,000 మొత్తమును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధి మరియు లోన్ రూపంలో వారికి అందించినారు. నవోదయం 2.Oలో భాగంగా గుర్తించిన (28) గ్రామాలను నాటు సారా రహిత గ్రామాలుగా, (9) మండలాలను నాటు సారా రహిత మండలాలుగా గుర్తించడంతో పల్నాడు జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించటం జరిగిందన్నారు. మార్పు వచ్చిన గ్రామాలపై నిరంతర నిఘా కొనసాగాలని, నాటు సారా పునరుత్పత్తి చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించినారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి సహకారంతో నాటు సారా పునరాత్పత్తి మరియు పునరావతారం కాకుండా ప్రతిష్టమైన ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో భాగంగా డిప్యూటీ కమీషనర్ అఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కే. శ్రీనివాసరావు, గుంటూరు వారు, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్(STF), మంగళగిరి,
ఎమ్.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ (ENFT) గుంటూరు, ఎం.రవి కుమార్ రెడ్డి వారు, ప్రాజెక్టు డైరెక్టర్ డి.ఆర్.డి.ఐ పల్నాడు జిల్లా వారు, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ పల్నాడు జిల్లా వారు , డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్, పల్నాడు జిల్లా వారు, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
కె.మణికంఠ , అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి. సూర్యనారాయణ, (ENFT) గుంటూరు వారు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్
కె.రవీంద్ర, నరసరావుపేట వారు మరియు ఎక్సైజ్ స్టేషన్లో ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు
.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.