Friday, July 11, 2025

ఆంధ్రలో ‘ నందులు’ నడిచేదెప్పుడు?

నారద వర్తమాన సమాచారం

ఆంధ్రలో ‘ నందులు’ నడిచేదెప్పుడు?

‘మా- ఏపి’ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా

గుంటూరు,

ఆంధ్ర ప్రదేశ్ లో పదేళ్ళుగా ఆగిపోయిన నంది అవార్డులను నేటికీ ఎoదుకు ప్రకటించలేకపోతున్నారని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, 24 విభాగాల యూనియన్ ( మా- ఎపి ) వ్యవస్థాపకులు,సినీదర్శకుడు దిలీప్‌రాజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇప్పటికే తెలంగాణాలో గద్దర్ పేరిట సినిమారంగానికి అవార్డులను అందజేసి ముందంజలో ఉన్నప్పటికీ రాష్ట్రచలన చిత్ర అభివృద్ధి సంస్థ మౌనవ్రతంలో ఉండటం విచారకరమన్నారు.గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఒక అతిధి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు 2014 నుండి 2024 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో నిలిచిపోయిన నంది అవార్డులను ప్రకటించడానికి విధి విధానాల అమలులో అలసత్వం చూపడం దురదృష్టకరమని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం జయసుధ జ్యూరీ చైర్మన్ గా మురళీమోహన్ మరోకమిటీకి చైర్మన్ గా ఇప్పటి వరకు నిలిచిపోయిన అవార్దులను అందించి సినీపరిశ్రమలో పదేళ్ళుగా నెలకొన్న నిశ్శబ్దానికి తెరదించారన్నారు. రాజకీయాలకు అతీతంగా తక్షణమే ఆంధ్రాలో జ్యూరిని నియమించవలసిందిగా ఆయన ప్రభుత్వానికి కోరారు.సినీ రంగానికి విశిష్ట సేవలందించిన ఎన్టీఆర్,అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, రామనాయుడు,దాసరి నారాయణరావు, కె.విశ్వనాధ్ ల పేరిట అదనంగా ప్రత్యేక అవార్డులను అర్హతగల వ్యక్తులకు అందజేయాలని ప్రతిపాదిస్తున్నట్లు దిలీప్ రాజా సూచించారు.తద్వారా మరణించిన సినీ ప్రముఖులకు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవo ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అవార్దుల ఎoపికలో పారదర్శకత ఉండేలా రాజకీయ ప్రమేయం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.ఈ అంశoపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రులను స్వయంంగా కలిసి అభ్యర్ధి స్థామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ఎఫ్.డి.సి.చైర్మన్ పదవిని ఆంధ్ర ప్రదేశ్ లో నివాసం ఉంటున్న సమర్ధుడితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రికి దిలీప్ రాజా మనవి చేశారు.సమావేశంలో నటుడు మిలటరీ ప్రసాద్ పాల్గొన్నారు .


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading