నారద వర్తమాన సమాచారం
సికిల్ సెల్ అనీమియాను రూపుమాపుదాం: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
అరుదైన జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియాను రూపుమాపేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఏ కొద్ది మందికో వచ్చే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని గుర్తించడం, ఆ వ్యాధి సోకిన వారిని వెంటనే గుర్తించి వ్యాధి నుండి కాపాడితే ప్రాణాలు కాపాడ వచ్చునని పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు.
సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధిపై గురువారం నరసరావు పేట మండలం, పెద్ద తురకపాలెం గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం, పాఠశాలలో జరిగిన ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా అవగాహన సదస్సులో పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, స్థానిక శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు లు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వంశపారపర్యంగా, రక్తంలో ఆక్సిజన్ తక్కువై తెల్ల రక్త కణాల శాతం పడి పోతుందన్నారు. ఈ వ్యాధిని గుర్తించి వెంటనే ట్రీట్ మెంట్ ఇప్పించడం వల్ల వారిని ప్రాణాపాయం నుంచి కాపాడ వచ్చుననన్నారు. గిరిజనుల్లో ఈ వ్యాధి గురించి ఎక్కువ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
నరసరావు పేట నియోజక వర్గ శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఈ వ్యాధి ఎక్కువగా గిరిజన తెగలు కే ఎక్కువగా సోకు తుందని,వారిలో మేనరికాలు, ఒకే రక్తం కలిగిన వారిని వివాహం చేసు కోవడం వల్ల వ్యాధి సోకుతుందన్నారు. రక్తం హీనత, సరిపడ ఆక్సిజన్ అందక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారినీ జోత్స్న,ఆర్డిఓ మధులత,తహశీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.