నారద వర్తమాన సమాచారం
తెలుగు రాష్ట్రాల్లో నేడు నక్సల్స్ బంద్
మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది.
మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్-ఏపీ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు.. మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది దళసభ్యులు గురువారం భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట లొంగిపోయారు.
ఎస్పీ తక్షణ సహాయం కింద వారికి రూ.25 వేల చొప్పున నగదును అందజేశారు. కాగా, ఏపీలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఏపీలోని రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. గురువారం రవి మృతదేహాన్ని చూపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గురువారం సాయంత్రం రవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించి పోస్టుమార్టానికి తరలించినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం వెలిశాలలో రవి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.