నారద వర్తమాన సమాచారం
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి
వాషింగ్టన్ :
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్‌పై దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు తెలిపారు. భారీ బాంబులు ఫోర్డోపై వేశామని.. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామన్నారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదని.. ఇప్పుడు శాంతికి సమయమని పోస్టు చేశారు. మరో పోస్టులో ‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.