నారద వర్తమాన సమాచారం
విద్యుత్ రాయితీ వినియోగించుకోండి.. తుది గడువు జూన్ 30 వరకు
ఏపీ విద్యుత్ మండలి విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న 50 శాతం రాయితీ ఈనెల 30న ముగుస్తుందని మాచర్ల ఈఈ ఎన్. సింగయ్య, ఏ ఏ ఓ పి. సందీప్ కుమార్, జే ఏ ఓ కె. ఆశీర్వాదం తెలిపారు. గృహ వినియోదారులు వాడుకుంటున్న అదనపు లోడు క్రమబద్ధీకరణకు విద్యుత్తు కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని తగిన చార్జీలను చెల్లించాలన్నారు. అలానే. మీ సేవ, www.apcpdcl.in వెబ్సైట్ ను ఉపయోగించుకోవచ్చు అన్నారు.