నారద వర్తమాన సమాచారం
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ హాలునందు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌లను పోలీసులు పూర్తిగా తనిఖీ చేసి, పర్యవేక్షించాలన్నారు.
మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. డ్రగ్ అబ్యూస్ అవగాహన మరియు నివారణను ప్రోత్సహించడానికి పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేసి, క్లబ్ ల సభ్యుల వివరాలతో డేటాబేస్ నిర్వహించాలని డీఈవోను ఆదేశించారు.
ఎన్.డీ.పీ.ఎస్ కేసులు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద గతంలో నమోదైన కేసులు మరియు కొత్త కేసులపై సమీక్ష నిర్వహించారు.
మాదక ద్రవ్యాల వినియోగ దారుల గుర్తింపు,గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించే వ్యక్తులను గుర్తించి, ట్రాక్ చేయడానికి వ్యూహాలు అమలు చేయాలని సూచించారు.
డీ-అడిక్షన్ సెంటర్లలో మాదక ద్రవ్య వినియోగ దారుల పునరావాసం మరియు సహాయం కోసం డీ-అడిక్షన్ సెంటర్ల యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పారు.
ఇంటర్-డిపార్ట్‌మెంటల్ సహకారం, మాదక ద్రవ్య దుర్వినియోగ నిర్మూలన లో బాధ్యతాయుతమైన అన్ని శాఖలు మరియు స్టేక్‌హోల్డర్లు సమన్వయం తో చురుకుగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
జూన్ 26, 2025న అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వాకథాన్ నిర్వహణకు సూచనలు జారీ చేశారు. వాకథాన్ విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయం చేయాలన్నారు. డీ-అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
అదనపు ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్,
జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ,ఈగిల్ అధికారి సామాజిక సంక్షేమ అధికారి శామ్యూల్ రాజీవ్, జిల్లా రెవెన్యూ అధికారి డీఆర్వో ఈ. మురళి, మాతా జ్ఞానమ్మ డీ-అడిక్షన్ సెంటర్ (ఎన్జీవో) ప్రతినిధులు, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి రవి,స్పెషల్ బ్రాంచ్ అదనపు ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.