నారద వర్తమాన సమాచారం
ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ..
ఆ జిల్లాలో 100 ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్.. రూపురేఖలు మారనున్నయ్
కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్(రిలయన్స్ కంపెనీ)కు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం(ఏపీ ప్రభుత్వం) ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో శీతలపానియాలు, జ్యూస్లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ(ఉద్యోగం) అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు(చంద్రబాబు) అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ(SIPB) సమావేశంలో ఆమోదం లభించింది.
*కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఏపీఐఐసీ(ఏపీఐఐసీ) ల్యాండ్ బ్యాంక్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ప్లాంట్ ఏర్పాటు కోసం ఎకరా రూ.30 లక్షల ధర కు 80 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు. ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబడ్డాయి.
వచ్చే ఏడాది 2026 డిసెంబర్‌లో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ ఉత్తర్వుల్లో రిలయన్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టేందుకు ఏపీఐఐసీ చైర్మన్, ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య విభాగం కార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు!!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.