నారద వర్తమాన సమాచారం
చెట్టినాడ్ మరియు భవ్య సిమెంట్స్ బాధితులకు పరిహారం చెల్లింపు
చెక్కులు అందజేసిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
పంట నష్ట పరిహారం రూ.81.52 లక్షలు
ఇళ్ల నష్ట పరిహారం రూ.41 లక్షలు
50 మందికి ఉద్యోగ కల్పన
దాచేపల్లి,
చెట్టినాడ్ సిమెంట్స్ మరియు భవ్య సిమెంట్స్ కార్యకలాపాల కారణంగా పంట నష్టపోయిన రైతులు, ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
పరిహారం చెక్కులు అందజేశారు.
మంగళవారం మధ్యాహ్నం పెదగార్ల పాడు గ్రామంలో భారీ సంఖ్యలో రైతులు, స్థానికుల మధ్య అట్టహాసంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
తక్కెళ్లపాడు, తంగేడ గ్రామాల్లో పంట నష్టపోయిన 179 మంది రైతులకు రూ.81.52 లక్షల రూపాయలు పరిహారం చెల్లించారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.30,000, పత్తి రైతులకు ఎకరాకు రూ.20,000 పరిహారం దక్కింది.
పెదగార్ల పాడు, తంగేడ గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లకు గానూ ఒక్కో ఇంటికి రూ.30,000 చొప్పున మొత్తం 137 ఇళ్లకు రూ.41.10 లక్షలు పరిహారంగా చెల్లించారు.
వీరితో పాటూ సిమెంట్ కంపెనీలకు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు చెందిన 50 మందికి సదరు కంపెనీలలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 35 మందికి శాశ్వత ప్రాతిపదికన, మరో 15 మందికి కాంట్రాక్టు విధానంలో ఉద్యోగ కల్పన చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మురళి, గురజాల ఆర్డీవో మురళీ కృష్ణ, డీఎల్డీవో గబ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.