నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 88 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన దేశ కృష్ణవేణి అను ఆమె డిగ్రీ BSC కంప్యూటర్ పూర్తి చేసినట్లు, వివాహం అయి తనకు పుట్టిన పాపతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లు, అదే గ్రామానికి చెందిన మెరుగు ఏడుకొండలు అను అతను తనకు ఎమ్మెల్యే దగ్గర పీఏ బాగా తెలుసు అని ఉద్యోగం ఇప్పిస్తాను అని 70,000/- రూపాయలు అడిగినట్లు, అందుకుగాను ఫిర్యాది 25,000/- రూపాయలు ఫోన్ పే చేసినట్లు రోజులు గడుస్తున్నప్పటికిని ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తున్నందుకుగాను డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగగా మాట దాట వేస్తున్నందుకు గాను తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట పనస తోటకు చెందిన ఒబ్బాని లక్ష్మి తన కుమార్తె అయిన జస్వంతికి 19 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చి ఐదు లక్షల రూపాయలు అవసరమై వడ్డీకి తీసుకొని మొత్తం చెల్లించినట్లు, ఫిర్యాది వడ్డీకి తీసుకున్నటువంటి తులం నాగలక్ష్మి ది.12.02.2025వ తేదీన మరణించినట్లు, ఆమె మరణానంతరం నాగలక్ష్మి కూతుర్లు అయిన యాగమ్మ, సుజాత మరియు కొడుకు అయిన కామేష్ ఆ సంతకం మాది కాదు, ఆ పుస్తకాలు కూడా మావి కావు అని కావున డబ్బులు చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నందుకు గాను తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఇవ్వడం జరిగింది.
గురజాలకు చెందిన షేక్. అజారుద్దీన్, షేక్. మొహమ్మద్ రఫీ మరియు షేక్. నాగుల్ మీరా అనువారు ది.26.09.2023 లో విజయవాడలో ఉన్నటువంటి Board To Aboard కంపెనీ MD అయిన P. సీమ ఆస్ట్రేలియాలో జాబ్ ఇప్పిస్తామని ఒక్కొక్కరికి 14 లక్షలు ఖర్చు అవుతుందని, అడ్వాన్స్ గా ఒక్కొక్కరి వద్ద నుండి రెండు లక్షల చొప్పున ముగ్గురి నుండి ఆరు లక్షల రూపాయలు తీసుకున్నట్లు,కాగా వారు ప్రస్తుత కాలం వరకు కాలయాపన చేస్తూ ఫిర్యాదులకు జాబ్ ఇప్పించకుండా వారి సొమ్ము వారికి తిరిగి చెల్లించకపోయేసరికి అనుమానం వచ్చి తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామానికి చెందిన చందనాల నాగపుష్పావతి గారికి ఇద్దరు కుమారులు ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు మరియు కుమారుడికి రెండు ఎకరాల చొప్పున పొలం రాసి ఇచ్చినట్లు, ఫిర్యాదు పేరు మీద మురికిపూడి గ్రామంలో స్వంత గృహము మరియు 8 ఎకరాల 60 సెంట్లు వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లు, అయితే ఫిర్యాది పేరు మీద ఉన్నటువంటి ఆస్తి మొత్తము తన పేరు రిజిస్టర్ చేయమని ఫిర్యాదు కుమారుడు అయిన చందనాల వెంకటరామన్ కొడుతూ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నట్లు, రిజిస్టర్ చేయకపోతే చంపివేస్తానని బెదిరిస్తున్నందుకుగాను ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
చిలకలూరిపేటకు చెందిన వడితే మంగబాయి కి 2000వ సంవత్సరంలో మొదటి వివాహం అయినట్లు,2005వ సంవత్సరంలో మొదటి భర్త అనారోగ్య కారణాలవల్ల మరణించినట్లు, భర్త మరణానంతరం ఫిర్యాది తన కుమారుడితో చిలకలూరిపేట లోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఉండగా 2007 వ సంవత్సరంలో బాపట్ల జిల్లా నర్సాయపాలెం కి చెందిన కారుమంచి సురేష్ బాబు తో పెద్దల సమక్షంలో వివాహము చేసుకున్నట్లు, ఆ సమయంలో పసుపు కుంకుమల కింద ఫిర్యాదు పుట్టింటి వారు ఒక ఎకరం పొలం ఇచ్చినట్లు, కొన్ని సంవత్సరాలు కాపురం బాగానే చేసి 2018 వ సంవత్సరంలో ఫిర్యాదు భర్త చెడు అలవాట్లకు బానిస అయి కొంతమందితో
కలిసి నకిలీ ఏసీబీ అవతారం ఎత్తి మార్కాపురం, బల్లి కురవ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్లు, ఆ విషయంలో ఫిర్యాది చిన్న తమ్ముడు అయిన వడితే శీను నాయక్ పోలీస్ వారికి సహాయం చేసి సురేష్ బాబుని పోలీసు వారికి అప్పగించాడనే అనుమానంతో ఫిర్యాదుని చాలా రకాలుగా శారీరకంగా, మానసికంగా హింస పెట్టినట్లు, అతను జైలుకు వెళ్లి వచ్చిన తరువాత అతని పని అతని చేసుకుంటూ గత ఆరు నెలల నుండి మద్యానికి బానిస అయ్యి ఇంట్లో ఉన్న బంగారం మరియు డబ్బు తీసుకెళ్లి డబ్బు దుబారాగా ఖర్చు చేస్తున్నాడని అత్తమామలకు పలుమార్లు చెప్పినప్పటికీ వాళ్లు పట్టించుకోకపోగా ఫిర్యాదిని వదిలించుకోవాలని ఫిర్యాది అత్తమామ, ఆడబిడ్డ అతని భర్త కొట్టి, ఇంట్లో నుంచి బయటికి నెట్టి వేసినందుకు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.
దూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు భోజన ఏర్పాట్లు చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.