నారద వర్తమాన సమాచారం
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ 11వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ
సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు
గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్న కన్నా
సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు స్వయంగా వివరించిన శాసన సభ్యులు కన్నా గారు .
ప్రతి ఇంటిలో సమస్యలు తెలుసుకొని,వాటిని మై టిడిపి యాప్‌లో స్వయంగా నమోదు చేసిన , వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ .
రానున్న నాలుగు సంవత్సరాల్లో మరింత నిధులు తీసుకువచ్చి సత్తెనపల్లి అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తామన్న శాసన సభ్యులు కన్నా గారు .
గత ప్రభుత్వంలో అమ్మ ఒడి అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే పరిమితం చేశారు
కూటమి ప్రభుత్వం లో సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం, దీపం పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ యువతకు ఉద్యోగాలు హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలోనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండలకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.