నారద వర్తమాన సమాచారం
నాన్ మస్టర్ రోల్స్ వేతనాల పెంపునకు ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో నాన్ మస్టర్ రోల్ విధానంలో పని చేసే కార్మికుల వేతనాల పెంపుదలకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆమోదం తెలిపారు.
అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనం రోజుకు రూ.864 నుంచి రూ.899 కి పెంచారు. నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనం రూ.855, పాక్షిక నైపుణ్య కార్మికుల వేతనం రూ.742, నైపుణ్యం లేని కార్మికుల వేతనం రూ.619గా నిర్థారించారు.
జిల్లాలోని ప్రభుత్వ శాఖలు తాత్కాలిక అవసరాల కోసం రోజు వారీ ప్రాతిపదికన పని చేసే నాన్ మస్టర్ రోల్ కార్మికులకు నూతనంగా నిర్ధారించిన వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు జిల్లా స్థాయి నాన్ మస్టర్ రోల్ వేతనాల స్థిరీకరణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రావు, సీపీఓ జి.శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఎస్.ఈ రాజా నాయక్, డీఈవో చంద్రకళ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్.ఈ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.