నారద వర్తమాన సమాచారం
నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించండి
పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
పల్నాడు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 22 ఏ లిస్టులో పడిన భూములను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్పష్టం చేశారు.
పల్నాడు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఉదయం కలెక్టర్ పి. అరుణ్ బాబు,జాయిం ట్ కలెక్టర్ సూరజ్ ధనుంజ య్ గనోరే,డి.ఆర్.ఓ మురళి లు పాల్గొన్నారు.
జిల్లాకు చెందిన ముగ్గురు ఆర్డీవోలు నరసరావుపేట మధు లత,సత్తెనపల్లి రమణారెడ్డి, గురజాల మురళీకృష్ణ లు వారి పరిధిలో ఉన్న తహశీల్దార్లు హాజర య్యారు.
వారి పరిధిలోని 22 ఏ లిస్ట్ లో పడిన భూములు, గత కొన్నేళ్లుగా రైతులు సమస్యలు పరిష్కారం కానీ భూములు అన్నింటిని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,జాయింట్ కలెక్టర్ లు ఆ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి,ఆయా పరిధిలో పనిచేస్తున్న ఆర్డీవోలు,తహశీల్దార్లు హాజరవ్వగా, వారిని రెవెన్యూ భూములకు సంబంధించి వారి దగ్గర ఉన్న, లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించిన భూములను పరిశీలించారు.
మూడు రెవెన్యూ డివిజన్ల కు సంబంధించి 22 ఏ లిస్టులోని భూములు ఎవరెవరికి చెందినది, వారికి ఎలా సంక్రమించింది జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే అడిగి తెలుసు కున్నారు.
ఆయా భూములను సరైన ఆధారాలు చూపినచో, అలాంటి వాటిని వెంటనే తీసుకొని,ఆయా భూములను వారి వారి రైతులకు, అర్హత కలిగిన వారికి 22 ఏ నుండి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్ రెవెన్యూ సూపరిండెంట్ నాగిరెడ్డి,అమరావతి తహశీల్దా ర్ దానియేలు,వెల్దుర్తి తహశీల్దా ర్ జి. శ్రీనివాస్,మాచర్ల తహశీ ల్దార్ కిరణ్, మాచవరం తహశీ ల్దార్ నాగ మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.