నారద వర్తమాన సమాచారం
కేబినెట్ స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు..!!
నేడు క్యాబినెట్ భేటీలో చర్చ ప్రధానంగా వీటిపైనే
గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీకి అవకాశం!
బనకచర్ల, రాజీవ్ యువ వికాసంపైనా చర్చ
రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీకానుంది.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అం శాలను క్యాబినెట్ చర్చించనుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు మేరకు వారం రోజుల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అయితే బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్న అంశంపై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్‌ను జారీ చేయించి, జీవోను తీసుకురావాలని యోచిస్తోంది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించి, ఒక నిర్ణయానికి రానున్నారు. వివాదాస్పదమైన బనకచర్ల ప్రాజెక్టుపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. నికరజలాలు కాకుం డా సముద్రంలో వృథాగా కలిసే వరద నీటిని తెలుగురాష్ట్రాలు వినియోగించుకుందామం టూ ఏపీ సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. అయితే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. రాజీవ్‌యువ వికాసం పథకంపైనా చర్చ జరిగే అవకాశముంది. దీని కింద నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా లబ్ధిదారులను ఖరారు చేయలేదు. వైద్య కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన అంశం కూడా చర్చకు రానుంది.
300 తీర్మానాల్లో ఎన్ని అమలయ్యాయి
గత క్యాబినెట్ సమావేశాల్లో చర్చకు వచ్చి న అంశాలను కూడా గురువారం జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు. తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సమీక్షించనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసి వాటి అమలును పర్యవేక్షించాల ని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు మంత్రి మండలి తీసుకున్న సుమారు 300లకుపైగా నిర్ణయాలను ఆయా శాఖల వారీగా ఎంత మేర అమలు చేశారనే దానిపై బుధవారం ప్రభుత్వం నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. సచివాలయం, మంత్రివర్గస్థాయిలో నిర్ణయాలు, ఆదేశాలు 90శాతంపైగా అమలైనా.. జిల్లా స్థాయి లో అమలు ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ వివరాలపై నేటి క్యాబినెట్ సమావేశంలో ప్రత్యేకం గా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.