నారద వర్తమాన సమాచారం
అసిస్ట్ అద్వర్యం లో విద్యార్థులకు 452 సైకిళ్ల పంపిణీ చేసిన. మంత్రి గొట్టిపాటి
మేదరమెట్ల:
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు మేదరమెట్ల ZPH ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా 452 సైకిళ్లను పంపిణీ చేశారు. MYTWO ఫండ్, మైరియడ్ (Myriad), మేఘా కంపెనీ (Megha Company), మరియు SEIL కంపెనీల సహకారంతో ఈ సైకిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలకు సుదూరం నుంచి రావడానికి పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ సైకిళ్లు ఎంతగాన ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి, DEO పురుషోత్తం, Dy DEO గంగాధర్,పాఠశాలప్రధానోపాధ్యాయురాలు అంజనాదేవి, అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్లు జె. కృష్ణ హరీష్, విష్ణుప్రియ, కోఆర్డినేటర్ డేవిడ్, మేలుకొలుపు సిబ్బంది, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.