నారద వర్తమాన సమాచారం
శ్రీ మద్ద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మఠం లో అపచారాలు
కందిమల్లయ్య పల్లె
శ్రీ మద్ద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో అపచారాలు చేస్తున్న దివంగత పీఠాధిపతి రెండో భార్య అయిన మారుతి మహాలక్ష్మి కుమారులు గోవింద స్వామి తన రెండవ కుమారుడు.
కలియుగ ప్రత్యక్ష దైవము, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల ను గూర్చి కాలజ్ఞాన బోధ ను చేసినటువంటి
శ్రీ మద్ద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నడయాడినటువంటి మహా నైవేద్య మండపంలో సనాతన సాంప్రదాయానికి వ్యతిరేకంగా గురు పౌర్ణమి రోజు గురువులను పూజించాల్సిన చేతులతో కోడిగుడ్లుతో మిక్స్ చేసిన కేకులు కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్న దివంగత పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి రెండవ భార్య అయినా మారుతీ మహాలక్ష్మి పుత్రులైన గోవింద స్వామి అతని తమ్ముడు
వీళ్ళనా మఠానికి పీఠాధిపతి కావాలని అడుగుతున్న మారుతి మహాలక్ష్మమ్మ వీళ్లు సభ్య సమాజానికి ఏ రకమైనటువంటి మార్పు తేగలరు.
వీరిని ఇంతే వదిలేస్తే స్వామివారి నడయాడినటు వంటి మహా నైవేద్య మండపంలో ఇతర తర కార్యక్రమాలు కూడా చేసి మఠం యొక్క పరువు ప్రతిష్టలను నాశనం చేస్తారు
వీళ్లు తిరుపతిలో వేద అభ్యాసాన్ని అభ్యసిస్తున్నారు అని అంటున్నారు
ఇదేనా తిరుపతి వేద పాఠశాలలో అభ్యసించినటువంటి విద్య చేయరాని పనులు చేయటమే వీరు ఇప్పటివరకు అభ్యసించినటువంటి విద్య.
ఏది ఏమైనా మహా నైవేద్య మండపంలో సనాతన సాంప్రదాయానికి వ్యతిరేకంగా కోడి గుడ్లతో తయారు చేసినటువంటి కేకును కట్ చేసి గురుపూజ వేడుకలు జరిపినటువంటి వారిని
శ్రీ మద్ద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు ఏ రకంగా దండన విధిస్తారు అన్నది వేచి చూడాల్సిన అంశము.
ఏది ఏమైనా సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించడానికి తయారైనటువంటి ఈ రెండో భార్య ఆమె పుత్రులు బహిరంగముగా మఠం యొక్క పరువు ప్రతిష్ట లకు,అలాగే స్వామివారి భక్తులకు క్షమాపణలు చెప్పవలసిందిగా భక్తులు ఆక్రోశిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.