నారద వర్తమాన సమాచారం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో సేవలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో సేవలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల రూపకల్పనలో టీటీడీ ఇస్రో సేవలను వినియోగించుకోనుంది. కొన్నేళ్లుగా వాహన సేవల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్యను టీటీడీ లెక్కిస్తోంది. సెప్టెంబర్ 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే గరుడోత్సవం రోజున మాడవీధుల్లో భక్తుల రద్దీని శాటిలైట్ల ద్వారా గుర్తించి, సమాచారాన్ని తెలుసుకొని తద్వారా తగిన ఏర్పాట్లు చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.









