నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఇరువూరి శ్రీనివాసులు..
పిడుగురాళ్ల
ఈ రోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలో “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కమీషనర్ పట్టణ టీడీపీ అధ్యక్షులు, ఇతర స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మరియు కమీషనర్ మాట్లాడుతూ – పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా, శుభ్రమైనటుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.









