నారద వర్తమాన సమాచారం
వేలకోట్ల మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జిషీటు దాఖలైంది.
పలు కోణాల్లో దర్యాప్తు జరిపి… అనేక సాంకేతిక, ఇతర ఆధారాలు సేకరించిన సిట్…
అభియోగ పత్రంలో పలుచోట్ల ఆయన పేరు
రూ.3,500 కోట్ల స్కామ్పై తొలి చార్జిషీట్
305 పేజీలు.. 70 వాల్యూమ్స్
మద్యం పాలసీ, జీవోలు.. ఎఫ్ఎస్ ఎల్ నివేదికలు
268 వాంగ్మూలాలు.. నిందితుల స్టేట్మెంట్లు
తొలి చార్జిషీట్లో మిథున్రెడ్డి పేరూ!
కనిపించని ధనుంజయ్ రెడ్డి,కృష్ణమోహన్ రెడ్డి,బాలాజీ గోవిందప్ప పేర్లు
తదుపరి చార్జిషీట్లో చేరుస్తామంటున్న సిట్
20 రోజుల్లో మరో చార్జిషీట్ దాఖలు
అమరావతి, వేలకోట్ల
మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జిషీటు దాఖలైంది.
పలు కోణాల్లో దర్యాప్తు జరిపి… అనేక సాంకేతిక, ఇతర ఆధారాలు సేకరించిన ‘సిట్’… శనివారo విజయవాడ
ఏసీబీ కోర్టులో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసింది.
ఈ కుంభకోణంలో ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరో తేల్చే
దిశగా వేగంగా దర్యాప్తు సాగిస్తున్న సిట్ అధికారులు…చార్జిషీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును పలుచోట్ల ప్రస్తావించినట్లు తెలిసింది. ఎవరి ఆదేశాలతో మద్యం విధానాన్ని మార్చారు? ముడుపులు ఎలా మూటకట్టారు? వాటిని ఎక్కడికి, ఎలా తరలించారు? ఇందులో కీలక పాత్ర ఎవరిది? అనే ప్రశ్నలకుసాక్షులు,నిందితులు తెలిపిన అంశాలు, సేకరించిన ఆధారాలతో చార్జిషీటును రూపొందించారు.
ఇదే సందర్భంగా… పలుచోట్ల జగన్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. శనివారం అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును కూడా చార్జిషీటులో సిట్ ప్రస్తావించినట్టు సమాచారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(ఏ-1) అప్పటి ఎక్సైజ్ అధికారులు, డిస్టిలరీల యజమానులతో కలిసి మిథున్రెడ్డి (ఏ-4) ఈ కుంభకోణాన్ని ఎలా నడిపించారనేది కోర్టుకు సిట్ వివరించింది. కాగా, సీఎం మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎ్సడీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా 22మంది పాత్రని చార్జిషీట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. అతి త్వరలో మరో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నామని అందులో మరికొందరి నిందితుల పాత్రని ఆధారాలతో సహ చూపుతామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
ముడుపుల సొమ్ము రూటింగ్ ఇలా..
ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మొదటి అభియోగపత్రం 305 పేజీలు ఉన్నట్లు తెలిసింది. చార్జిషీట్తో పాటు 70వరకూ వాల్యూమ్స్ కోర్టుకు అందజేసిన సిట్ అధికారులు అందులో పేర్కోన్న అంశాల ఆధారంగా 28కి పైగా ఎఫ్ఎ్వ్సఎల్ నివేదికలు, ఎలకానిక్ పరికరాల విశ్లేషణలు, ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన జీవోలు, గత వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీపై ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు పొందుపరిచినట్లు సమాచారం. ప్రధానంగా మద్యం విధానం రూపకల్పనలో ఎవరెవరి పాత్ర ఏమిటి.? కుట్రదారులెవరు.? పాత్రధారులెవరు.? ప్రభుత్వ పెద్దలు ఏమి చేశారు.? ముడుపులు నిర్ణయించింది ఎవరెవరు.? వాటిని వసూలు చేసే బాధ్యత రాజ్ కసిరెడ్డికి అప్పగించడం వెనుక కారణాలు, అందుకున్న మొత్తం ఎంత.? నగదు కలెక్షన్లలో తీసుకున్న జాగ్రత్తలు,
ఆ సొమ్ము నిల్వ చేసిన డెన్లు, అక్కడి నుంచి బినామీ ఆస్తుల కొనుగోలుకు వెళ్లింది ఎంత.? హవాలా మార్గంలో దేశం దాటింది ఎంత.? ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరింది ఎంత.? గత ఎన్నికల సమయంలో ‘సిద్ధం’ సభలకు పంపించిన సొమ్ము వివరాలతోపాటు మాజీ సీఎం పేరు పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల నెట్వర్క్ ఏర్పాటు, ఆదాన్ డిస్టిలరీని స్వాధీనం చేసుకుని పాలసీకి భిన్నంగా రూ.1200కోట్ల మద్యం ఆర్డర్లు పొందిన వైనం, వసూలు చేసిన మొత్తాన్ని రూటింగ్ చేసిన తీరుపై వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారుల తో పాటు సాక్షులు ఇచ్చిన 268 స్టేట్మెంట్లు చార్జిషీట్తో పా టు కోర్టుకు అందజేసిన సిట్ అధికారులు, లిక్కర్ స్కామ్కు సంబంధించిన రూ.62.85 కోట్లు జప్తు చేసినట్లు తెలిపింది.
బంగారు షాపుల్లోకి మద్యం ముడుపులు..
కీలక డేటాను చార్జిషీట్లో సిట్ ప్రస్తావించింది. నిందితులు ధ్వంసం చేసిన సెల్ఫోన్లను ఐటీ నిపుణులతో డేటా రికవరీ చేసింది. దుబాయ్ పాటు హైదరాబాద్, తాడేపల్లి డెన్ల ఫొటోలు సేకరించింది. సమగ్ర వివరాలను అభియోగపత్రంలో పొందుపరిచింది. మద్యం పాలసీ తయారీ నుంచి లోకల్ బ్రాండ్ తయారీవరకు సాక్ష్యాధారాలను సేకరించింది. ముడుపుల సొమ్మును చలామణిలోకి తేవడంలో భాగంగా బ్లాక్ను వైట్గా మార్చినట్టు సిట్ గుర్తించింది. మద్యం ముడుపులను బంగారు షాపులలో పెట్టుబడులు పెట్టినట్టు కనుగొంది. ‘అంతిమ లబ్ధిదారు’కు చేరడంపై 20 రోజులలో మరో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి.
ఆ ఎనిమిది మంది పరారీలోనే..
సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్రెడ్డి పేర్లు కొత్తగా నిందితుల జాబితాలో చేర్చారు. వీరంతా పరారీలో ఉన్నారని సిట్ గుర్తించింది. ఇందులో ముప్పిడి అనిరుధ్ రెడ్డి….రాజ్ కసిరెడ్డి తోడల్లుడైన అవినాశ్ రెడ్డికి తమ్ముడు. అదాన్లో అనిరుధ్్ను డైరెక్టర్గా పెట్టి రూ.800 కోట్లకు పైగా లిక్కర్ ఆర్డర్లను రాజ్ కసిరెడ్డి ఇప్పించారు. బొల్లారం శివకుమార్ను అనిరుధ్ రెడ్డి స్థానంలోకి ఆ తర్వాత తెచ్చారు. ఇప్పటికీ ఆయనే కొనసాగుతున్నారు. సైమన్ ప్రసన్ ముడుపులు వసూళ్లుచేసి రాజ్ కసిరెడ్డి చెప్పినట్లు సిద్ధం సభలకు, వైసీపీ వాళ్లకు చేర్చేవారు. రాజీవ్ ప్రతాప్ దుబాయ్ డెన్లో లెక్కలు చూసే ఐఐటీ పట్టభద్రుడు.
మోహన్ కుమార్ హైదరాబాద్లో చికెన్ ఎంప్లాయ్ పేరుతో లిక్కర్ డెన్లను పర్యవేక్షించారు. సైమన్ ప్రసన్కు బావమరిది. సుజల్ బెహ్రూన్ మరో నిందితుడు తుతేకుల కిరణ్ కుమార్రెడ్డికి స్నేహితుడు. ముడుపుల వసూళ్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి తాడేపల్లి డెన్ను ప్రణయ్ ప్రకాశ్తో కలిసి పర్యవేక్షించారు. అనిల్ కుమార్ రెడ్డి డబ్బులు రూటింగ్ చేసేవారు. అనిరుధ్ రెడ్డికి బామ్మర్ది. కాగా, గత ఏడాది సెప్టెంబరులో సీఐడీ కేసు నమోదు చేసినప్పుడు ఐదుగురి పేర్లు ఉండగా, కేసు సిట్ చేతికి చేరిన తర్వాత ఆ సంఖ్య 29కి చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాలుగో వారంలో రాజ్ కసిరెడ్డి(ఏ-1)ని అరెస్టు చేసినప్పుడు ఈ పేర్లు సిట్ బయటపెట్టింది. అందులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (ఏ-4), విజయ సాయిరెడ్డి(ఏ-5)సహా పలువురు వ్యక్తులు, డిస్టిలరీలు ఉన్నాయి. ఆ తర్వాత దర్యాప్తులో లభించిన ఆధారాలతో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్ఓ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పేర్లు చేర్చింది. కాఫీ షాపు ఉద్యోగిగా ఉంటూ 459కోట్లు లిక్కర్ టర్నోవర్ చేసిన లీలా డిస్టిలరీస్ డైరెక్టర్ వరుణ్ పురుషోత్తం(ఏ-40) పేరు చివర్లో ఉంది. తాజాగా 8 మందిని చేర్చడంతో నిందితుల సంఖ్య 48కి చేరినట్లయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.