నారద వర్తమాన సమాచారం
మాజీ గవర్నర్ దత్తాత్రేయ, కళాకారులను సన్మానించిన మంత్రి సీతక్క
తెలంగాణ భావజాల వ్యాప్తిలో మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు
కథలు, కవితలు, మాటల రూపంలో తెలంగాణ ఆవేదనను ఆయన వ్యక్తపరిచారు
అలాంటి మహానీయులను గుండెల్లో పెట్టుకోవాలి
ఆయన తోవ్వలోనే నడిచి తెలంగాణ సాధనలో కళాకారులు తమ వంతు పాత్ర పోషించారు
ముచ్చర్ల సత్యనారాయణ ఆశయాలను స్ఫూర్తిని పదిలంగా కాపాడి 10 తరాలకు అందించాలి
నిజాయితీ, నిబద్ధతను, పోరాటాన్ని ఆలోచన విధానాన్ని పరిరక్షించాలి
గ్రామపంచాయతీల బలోపేతం కోసం ముచ్చర్ల సత్తన్న పరితపించారు
ఆయన పేరు మీద స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం
వరంగల్లో ఒక మంచి విద్యా సంస్థకు ఆయన పేరు పెడతాం
చాకలి ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాపూజీ, రావినారాయణరెడ్డి వంటి ప్రముఖుల పేర్లను విద్యాసంస్థలకు పెడుతున్నాం
సర్పంచుల లేని లోటు గ్రామాల్లో కనిపిస్తోంది
ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్లకి కమిట్మెంట్ ఉంటుంది
1958 లోనే గ్రామ పంచాయతీలు సర్పంచ్ల ప్రాముఖ్యతను తన పాటల ద్వారా ముచ్చర్ల సత్తన్న వివరించారు
గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ముచ్చర్ల సత్తన్న ఆలోచనలకు అనుగుణంగా సర్పంచులకు శిక్షణ ఇస్తాం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.