Tuesday, July 22, 2025

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా పోలీసులు..

నారద వర్తమాన సమాచారం

మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా పోలీసులు

మాదకద్రవ్యాల నిర్మూలన పై జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు….

మాదక ద్రవ్యాల వినియోగం – మానవ మనుగడకు హానికరం.

మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి మనమందరం నడుం బిగిద్దాం
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్….

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు  ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలో మాదకద్రవ్యాలు మరియు గంజాయి వినియోగం వలన జరిగేటువంటి అనర్ధాల గురించి అవగాహన కలిగిస్తూ స్కూళ్ళలో మరియు కాలేజీల నందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన పెంపొందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

జిల్లాలోని పోలీసు అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ….

డ్రగ్స్‌ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబాలకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ నుండి దూరంగా ఉండాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి వారి సేవలను వినియోగించుకొననున్నట్లు తెలిపారు.

కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండాలని, ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని,వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారని, వారు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి తమ వ్యసనాలను తీర్చుకోవడానికి నేర పవృత్తి వైపు మళ్ళి నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని, కావున తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని, నేటి బాలలే – రేపటి పౌరులు కనుక ఆరోగ్యకరమైన, సమర్ధవంతమైన పౌర సమాజాన్ని నిర్మించడానికి నడుం బిగించాలని పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు కూడా మంచి – చెడుల విచక్షణా జ్ఞానం కలిగి, గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లను దరిచేరనివ్వకుండా మంచి నడవడిక కలిగి తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మాటలను శిరసావహించి వారు చూపించే మార్గంలో నడిచి, చదువుపై దృష్టి సారించి మంచి మిత్రులతో స్నేహం చేస్తూ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించేందుకు శ్రమించాలని విద్యార్థులకు సూచించారు.

మీ పరిసరాలలో గంజాయి, మాదక ద్రవ్యాలను ఎవరైనా వినియోగించిన లేదా విక్రయించిన సదరు సమాచారాన్ని దగ్గరలోని పోలీస్ వారికి గాని, 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading