నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ విశ్వ కుటుంబ సమావేశం
ప్రకాశం జిల్లా అద్దంకి:
ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం వ్యాప్తి చెందాలని ఉద్దేశంతో విశ్వకుటుంబ వరల్డ్ ఎన్ ఆర్ ఐ సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రంలోనూ సనాతన విస్తరింప చేయాలని డాక్టర్ సత్య ప్రకాష్ గురూజీ శ్రీకారం చుట్టారు
డాక్టర్ :సత్య ప్రకాష్ గురూజీ మరియు డాక్టర్ : చేతాలి మేడం ఆదేశానుసారం సనాతన ధర్మం ప్రతి రాష్ట్రంలో నూతన కమిటీలను ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ ఆర్గనైజేషన్ యూత్ అధ్యక్షులు వాకా గంగాధర్. మరియు రాష్ట్ర అధ్యక్షులు చావా రామకృష్ణ, ఉపాధ్యక్షులు జాగర్లమూడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా చెన్నుపల్లి శ్రీనివాసచారిని నియమించడం జరిగినది.
సనాతన ధర్మం వ్యాప్తి చేయడంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీమ్ అద్దంకిలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన యూత్ అధ్యక్షులు వాక గంగాధర్ రాష్ట్ర అధ్యక్షులు చావా.రామకృష్ణ , ఉపాధ్యక్షులు జాగర్లమూడి శ్రీనివాసు ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నపల్లి శ్రీనివాస చారి దృశ్యాలతో సత్కరించడం ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో పలు అంశాలను చర్చించి జిల్లాల వారీగా కమిటీలు వేయుటకు నిర్ణయించడం మరియు విశ్వకుటుంబ వరల్డ్ ఎన్ఆర్ఐ సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు ఈ సమావేశం జరిగింది
ఈ కార్యక్రమంలో స్థానిక సభ్యులు చోడ వెంకట సుబ్బారావు తో పాటు పలువురు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.