నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పి.4 విధానాన్ని సమర్థ వంతంగా అమలు జరపాలి
పేదరికం లేని సమాజ స్థాపన కోసం ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు సరైన సమయం లో సహకారం అందించాలి
పల్నాడు జిల్లా కలెక్టర్ : పి. అరుణ్ బాబు
పల్నాడు జిల్లా (నరసరావు పేట) :
ప్రభుత్వ ఆదేశాల మేరకు P4 కు సంబంధించి నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో 15,17 వార్డులలో వార్డు సభను నిర్వహించడం జరిగింది.
సభలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, విశిష్ట అతిధిగా చదలవాడ అరవింద్ బాబు లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు డా. చదలవాడ అరవిదబాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఆర్.డి.ఓ. మధులత, కమీషనర్ యశ్వంతరావు పి.4 యొక్క విధివిధానాలు, సచివాలయ సిబ్బంది నమోదు వివరాలు, ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
పి.4 అంటే నరసరావుపేట నియోజక వర్గంలో 63 వేలు నమోదు చేసు కున్నారని, వారిలో ఒక్క నరసరావు పేటలోనే సుమారు 4000 మంది ఉన్నారని, మార్గదర్శకు లుగా కేవలం 100 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు.
పల్నాడు జిల్లాలో ఎందరో డబ్బులు ఉన్నవారు, డాక్టర్లు, వ్యాపారులు, ఉద్యోగులు, ఆర్థికంగా స్థిరపడిన వారు, విదేశాలలో ఉంటున్న వారు ఉంటున్నారని, ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చదలవాడ అరవింద్ బాబు కూడా ఒక డాక్టర్ ఏనని, పి.4 అంటే లేని వ్యక్తికి ఆర్థిక సాయం, రైతులకు సాయం, పిల్లల కు సాయం, ఉద్యోగ సాయం ఇలా ఏదైనా సాయం చేయవచ్చు అని, కనీసం మాట సాయమైనా చేయవచ్చునని,గుర్తు పెట్టు కోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది మరియు వార్డ్ సభ్యులు ఇతర ఇన్చార్జి లు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.