నారద వర్తమాన సమాచారం
ఎం.ఎస్.ఎం.ఈ – ర్యాంప్ –రైజింగ్ అండ్ యాక్సిలేటింగ్, ఎం.ఎస్. ఎం.ఈ పెర్ఫార్ మెన్స్ పై పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్ష
పల్నాడు జిల్లాలోని కలెక్టరేట్ లో ఉన్న ఎస్. ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్షలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పని చేసేందుకు జిల్లా పరిశ్రమల అధికారి జి. కృష్ణారావు ను నోడల్ అధికారిగా నియమిస్తూ ఆయా మండలాల స్పెషల్ ఆఫీసర్లుకు ర్యాంపు ప్రోగ్రాం నకు ప్రత్యేక పర్యవేక్షణ చేయుటకు ఆదేశాలను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ప్రతి నియోజక వర్గ స్థాయి లో ఎం.ఎస్.ఎం.ఈ – ర్యాంపు కార్యక్రమం నిర్వహించేలా షెడ్యూల్ ను తయారు చేసి ప్రతి ఒక్క మండల ప్రత్యేక అధికారికి ప్రణాళిక ప్రకారం ఇవ్వాలని ఆదేశించారు.
ఎం.ఎస్.ఎం.ఈ – ర్యాంపు కింద (1). ఉద్యమి రిజిస్ట్రేషన్ వర్క్ షాప్, (2). జె.ఈ.డి వర్క్ షాప్
(3) రివర్స్ బయర్ సెల్లర్ మీటింగ్.(4) వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం.
(5) ఇ.ఎస్.డి.పి. – ఎంట్రప్రెనర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్.(6) ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ టెక్నిక్స్,(7) ట్రేడ్ రేసివబుల్స్ పై కార్యక్రమము నిర్వహించవలసినడిగా నోడల్ అధికారి మరియు సంబంధిత అధికారులకు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమములో జిల్లా పరిశ్రమల ఆధికారి డి.ఆర్.డి.ఆర్ పి.డి,మెప్మా పి.డి, ఎల్.డి.ఎం, మునిసిపల్ కమిషనర్ నరసరావుపేట, పిడుగురాళ్ళ మరియు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.