Tuesday, July 29, 2025

భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

నారద వర్తమాన సమాచారం

సింగపూర్:

భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

సమావేశంలో పాల్గొన్న మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టిజి భరత్ తో పాటు ఎపి ప్రభుత్వ అధికారులు
వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్ , ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాలను వివరించిన భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే
ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్,ఏవియేషన్, సెమి కండక్టర్స్,పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను వివరించిన హైకమిషనర్
ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని తెలిపిన శిల్పక్ అంబులే
భారత్ లో ప్రత్యేకించి ఏపిలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్న భారత హైకమిషనర్
సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హైకమిషనర్
గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామన్న సిఎం
కొన్ని కారణాల వల్ల రాజధాని అమరావతి ప్రాజెక్టునుంచి సింగపూర్ బయటకు వెళ్లిందన్న సిఎం
సింగపూర్ తో రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని…తన పర్యటనలో కొన్ని రికార్డులను సరి చేసేందుకు ప్రయత్నం చేస్తానన్న సిఎం
ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలు, పెట్టబడులకు గల అవకాశాలను వివరించిన సిఎం
గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్న సిఎం
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపిలో ఇప్పటికే పట్టాలెక్కాయని వివరించిన సిఎం
ఇండియా క్వాంట్వం మిషన్ లో క్వాటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతుందని వివరించిన సిఎం
డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపిన సిఎం
ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలి…వాటికి ఎపి గేట్ వేగా ఉంటుంది అని చెప్పిన ముఖ్యమంత్రి
సింగపూర్ లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ అని వివరించిన హై కమిషనర్..ఏపిలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించిన మంత్రి నారాయణ
ఏపిలో పెట్టుబడులకు అవసరమై సహకారన్ని అందించాలని కోరిన సిఎం చంద్రబాబు
విద్యా రంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, తమ ఆలోచనలను వివరించిన మంత్రి లోకేష్
ఎపిలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి వివరించి…ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామన్న మంత్రి లోకేష్


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading