నారద వర్తమాన సమాచారం
జిల్లా పరిషత్ హై స్కూల్ శంకర భారతి పురం సందర్శించిన జిల్లా కలెక్టర్
ఈరోజు ది: 28/07/2025న పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు జిల్లా పరిషత్ హై స్కూల్ శంకర భారతి పురంను సందర్శించడం జరిగింది.
టీచరుగా మారి విద్యార్థినీ, విద్యార్థుల్లో వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
ఈ సందర్శనలో భాగంగా
గత సంవత్సర ఎస్.ఎస్.సి పరీక్షల ఫలితాలపై, విద్యార్థినీ విద్యార్థుల ఈ సంవత్సరం ఏ విధంగా చదువుతున్నారు అని సమీక్షించారు.
సబ్జెక్టుల వారిగా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల వివరాలు తెలుసుకొని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులతో మాట్లాడటం జరిగింది.
ఈ సంవత్సరం మరింత మెరుగైన మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం జరిగింది.
ఆరవ తరగతి సి. సెక్షన్ మరియు ఇ. సెక్షన్ల లోని విద్యార్థుల యొక్క తెలుగు ఆంగ్లము మరియు హిందీ సామర్థ్యాలను పరీక్షించడం పల్నాడు జిల్లా కలెక్టర్ టీచర్ గా మారి పిల్లలతో పాఠాలు చెప్పించడం,తెలుగు,ఇంగ్లీష్, హిందీ భాషలలో బ్లాక్ బోర్డ్ పై రాయించడం జరిగినది.
చదవడం మరియు రాయటంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని టీచర్లకు పల్నాడు జిల్లా కలెక్టర్ డి ఈ ఓ చంద్రకళకు ఆదేశించారు.
మరలా తిరిగి కొద్ది రోజులలో సందర్శిస్తానని, అప్పటికల్లా విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుదల ఉండాలని తెలిపారు.
కలెక్టర్ తో పాటు పల్నాడు జిల్లా డి.ఈ.వో చంద్రకళ, నరసరావు పేట ఉప విద్యాశాఖ అధికారి సుభాని మరియు నరసరావుపేట మండల విద్యాశాఖ అధికారి ఎస్. నాగేశ్వరావు, హెచ్.ఎం, పి. పార్వతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.