నారద వర్తమాన సమాచారం
మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధ్యక్షతన కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు.
పిట్ ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, ఎక్కువ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తూ లేదా అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు.
మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.
డీ-అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.ఏరియా హాస్పిటల్ నందు ఉన్న డీ-అడిక్షన్ సెంటర్ కొత్తగా ఏర్పాటైన డీ-అడిక్షన్ సెంటర్లో అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. మాత జ్ఞానమ్మ డీ-అడిక్షన్ సెంటర్ ను సైకియాట్రిస్ట్ గారు నెలకు రెండు సార్లు విజీట్ చేయాలన్నారు.
మాదక ద్రవ్య దుర్వినియోగ నిర్మూలన లో బాధ్యతాయుతమైన అన్ని శాఖలు మరియు స్టేక్ హోల్డర్లు సమన్వయంతో చురుకుగా పాల్గొనాలన్నారు. మాదక ద్రవ్యాల పై అవగాహన ఇంటర్ – డిపార్ట్‌మెంటల్ సహకారంతో వీలైనన్ని ఎక్కువ అవగాహన కార్యక్రమాల ద్వార విద్యార్దులు మరియు ప్రజలలో మాదక ద్రవ్యాల వాళ్ళ కలిగే నష్టాలపై చైతన్యం కలిగించడం చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కలువ రవీంద్ర,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ రవి, ఏం. ప్రసూన, డి సి హెచ్ ఎస్, జి పి ఎస్ రాజు, సైకియాట్రిస్ట్,డి.ఈ.ఓ ఆఫీసు అధికారి కే ఏం ఏ హుస్సేన్,ఏ.డి :డి.వి.ఈ.ఓ ఆఫీసు అధికారి, డి ఎస్. వెంకటేశ్వర రావు, ఏ.జి.అండ్ ఏం.సి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాదికారి ఏం. ఉమాదేవి,జిల్లా పంచాయత్ అధికారి, ఎస్.వి.నాగేశ్వర నాయక్, డి.సి.జి.ఎస్.డబుల్యూ ఎస్ అధికారి ఏ.పి గోపిరెడ్డి, జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ సునీత, స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ ఇన్స్ పెక్టర్, శరత్ బాబు,ఈగల్ సెల్ మెంబెర్ షైక్. సుభాని పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.