నారద వర్తమాన సమాచారం
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలపై ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్ జెండర్ ల సంక్షేమ శాఖ ఏ డి దుర్గా భాయ్, వరలక్ష్మి, లాయర్
శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సఖ్యత లేని కారణంగా వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. శ్రీమంతుల కుటుంబాలో కూడా ఇటువంటి పరిస్ఠితి చూస్తున్నామన్నారు. తల్లితండ్రుల, వృద్ధుల సంరక్షణలో ఆయా కుటుంబ సభ్యుల బాధ్యత వహించాల్సి ఉందని, తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన స్వంత సంపాదన నుంచి లేదా అతని స్వంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్ డి ఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయవక్చునని, ఆర్ డి ఓ ద్వారా నోటీసులు అందించి విచారణ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని, సామరస్యంగా పరిష్కారం కాని సమస్యలకు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులను, తల్లిదండ్రులను, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత కుమారుల పైన, కుమార్తెల పైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సీనియర్ సిటిజన్, తల్లిందడ్రుల ఆహరం, వైద్యం, వసతి, తదితర ప్రాథమిక అవసరాలను నెరవెర్చలేని వారి వారసులకు తల్లిందడ్రులు సీనిరయర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమం చట్టం 2007 ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారన్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, u/s 173 crpc పై నివేదికను కోర్టుకు దాఖలు చేస్తారు. తల్లితండ్రులను దైవంతో సమానంగా చూడాల్సిన బాధ్యత కుమారులు, కుమార్తెల పై ఉన్నదని తెలిపారు. డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఈ చట్టం పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
లాయర్ శిరీష మాట్లాడుతూ తల్లిందడ్రులు సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమం కొరకు రాజ్యాంగం లో ఆర్టికల్ 41 ద్వారా చట్టాలు చేసుకునే అవకశం ఉందని పేర్కొన్నారు. సీనియర్ సిటిజనులు మరియు తల్లిదండ్రుల సంక్షేమం వారి వారసుల బాధ్యత చేస్తూ భారతదేశంలో చట్టపరంగా సమర్థవంతమైన నిబంధనలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా వృద్ధుల జీవితం మరియు వారి ఆస్తి రక్షణ కోసం సరళమైన వేగవంతమైన యంత్రాంగాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులు వారి వారసుల నుండి గౌరవ ప్రదంగా ఆహారం, దుస్తులు, వసతి మరియు వైద్య చికిత్స పొందడానికి అవసరమైన చట్ట సవరణలు చేయడం జరిగిందని తెలిపారు. వృద్ధులు లేక తల్లిదండ్రులు వారు పొందాల్సిన హక్కులకు భంగం వాటినట్లయితే సబ్ డివిజనల్ పరిధిలో సివిల్ కోర్టుతో సమానమైన అధికారాలు గల ఆర్ డి ఓ పరిధిలో ట్రిబ్యునల్ లో దరఖాస్తు దాఖలు చేయవచ్చని, స్వయంగా దరఖాస్తు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే రిజిస్టర్డ్ సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి నెల సీనియర్ సిటిజన్ల అవసరాల కోసం వారి వారసులు రూ.10 వేలు గరిష్టంగా అందించాలని ఆదేశించిందని తదుపరి కాలక్రమమైన చట్ట సవరణ ద్వారా ఈ గరిష్ట పరిమితిని తొలగించి ఆదాయ పరిమితులను అనుసరించి నిర్ణయించాలని సూచించింది అని తెలిపారు. వారసులు వారి తల్లిదండ్రుల నుండి ఆస్తులు పొందిన తరుణంలో వారి తల్లిదండ్రులకు అవసరమైన కనీస వసతులు, సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే చట్టం ముందు బాధ్యులవుతారని తెలిపారు. నిరుపేద సీనియర్ సిటిజనులకు వసతి ఆహారం వైద్య సంరక్షణ వినోద సౌకర్యాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించాలని చట్టం పేర్కొంటుందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక పడకలు, క్యూలు మరియు సౌకర్యాలు ఏర్పాటుచేసి సరైన వైద్య సహాయాన్ని అందించాలని తెలిపారు.
నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 ద్వారా ట్రాన్స్ జెండర్ లకు హక్కులు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వాటిని అమలు చేయడంలో జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ జెండర్ లను సమాజిక లింగ వివక్షత నుండి కాపాడాల్సిన భాద్యత ఉందన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.