నారదా వర్తమాన సమాచారం
దూరవిద్య పరీక్ష కేంద్రాలపై అసత్య కథనాల ప్రచారం తగదు.
చట్టపరమైన చర్యలకు సిద్ధం.
దూర విద్య నెల్లూరు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు..
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,దూరవిద్య కేంద్రం పరీక్ష కేంద్రాలపై తరచుగా అసత్య కథనాలు రాయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు నెల్లూరు జిల్లాలోని పలు ఏఎన్యూ దూరవిద్య కేంద్ర పరీక్షల నిర్వాహక కళాశాల యాజమాన్యాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆచార్య నాగార్జున వర్సిటీ దూర విద్య పరీక్షలు పరీక్షలు గత 22 రోజులుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని వెల్లడించారు.
నెల్లూరు జిల్లా సైదాపురం లోని సి. ఆర్ .ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సి డి ఇ పరీక్షల చీప్ సూపర్డెంట్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ తనిఖీ బృందం తమ కళాశాలను సందర్శించి పలు సూచనలు అందించారని తెలిపారు.ప్రతి విద్యార్థి హాల్ టికెట్లను తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలించారు.అంతేతప్ప మా నుండి డబ్బులు డిమాండ్ చేశారు అనే వార్త లో నిజం లేదు. నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
అదే జిల్లాకు చెందిన సంఘంలోని క్రిష్ నాగార్జున రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరస్పాండెంట్ పి .వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీ తనిఖీ బృందం తమ సెంటర్ ను సందర్శించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మంచినీరు, వాడుక నీరు తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారని చెప్పారు. ప్రత్యేక తనిఖీల బృందం తమ కళాశాలకు వచ్చి ఎటువంటి బెదిరింపులు చేయలేదని, ఎలాంటి డబ్బులు అడగలేదని తెలిపారు.
కాబట్టి వర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు ప్రయత్నించవద్దని,దూరవిద్య పరీక్ష కేంద్రాల మనుగడను కాపాడాలని కళాశాలల యాజమాన్యాలు కోరాయి.
అదేపనిగా వర్సిటిపై అసత్య ఆరోపణలు,వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధికారులను కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.