నారద వర్తమాన సమాచారం
ఓటర్ల సంక్షిప్త సవరణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా కలెక్టర్
ఓటర్ల సంక్షిప్త సవరణ పై జిల్లా కలెక్టర్, డీ.ఆర్.వో లు : రాజకీయ పార్టీలు,ఆర్డిఓ లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారులు తో సమీక్ష సమావేశం
పల్నాడు జిల్లా, 2 :
ప్రత్యేక సంక్షిప్త సవరణ 2026 ప్రకారం లో భాగంగా పల్నాడు జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, మార్పులు,చేర్పులపై జిల్లాలోని కలెక్టరేట్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు,జిల్లా రెవెన్యూ అధికారి ఏక. మురళి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ఆర్డీవోలు, ఏడు నియోజక వర్గాల ఎలక్ట్రోలర్స్ రిజిస్ట్రేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు,తహశీల్దార్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజర య్యారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత నియోజక వర్గాలలో సంబంధిత ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్, సహాయ ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అంతా కలిసి రాజకీయ పార్టీల ప్రతి నిధుల నుంచి స్వీకరించడం జరిగింది.
పల్నాడు జిల్లాలో గతంలో 1932 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఈసీఐ (రాష్ట్ర ఎన్నికల సంఘం) ఆదేశాల ప్రకారం ఒక్కో పోలింగ్ బూత్ కు 1200 ఓటర్లు దాకా పోలింగ్ కేంద్రాలుగా విభజన చేసి కొత్తగా 184 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం వాటి సంఖ్య 2115 పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరుగు తోందని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ ఏకా మురళి, ఆర్డీవోలు మధులత, రమా కాంత రెడ్డి, మురళీ కృష్ణ, ఏడు నియోజక వర్గాల ఎలక్ట్రోల్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్ట్రోల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.