నారద వర్తమాన సమాచారం
తిరుపతిలో అధిక శబ్ద వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. హర్షవర్ధన్ రాజు IPS., ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీలు J. వెంకటరావు (అడ్మిన్), K. రవిమనోహర ఆచారి (లా & ఆర్డర్) పర్యవేక్షణలో ట్రాఫిక్ డిఎస్పీ P. రామకృష్ణచారి నాయకత్వంలో తిరుపతి పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది.
ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు A. సంజీవ కుమార్, M. భాస్కర్ నాయక్, P. సుబ్బారామి రెడ్డి, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ ప్రత్యేక చర్యలో మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా అధిక శబ్దాన్ని సృష్టించే సైలెన్సర్లు, హారన్స్ అమర్చిన వాహనాలపై కఠినంగా జరిమానాలు విధించబడ్డాయి.
ఇప్పటివరకు, 60 ద్విచక్ర వాహనాల అధిక శబ్ద సైలెన్సర్లు తొలగింపు మరియు 500 అధిక శబ్ద హారన్స్ లపై జరిమానా మరియు తొలగింపు, ఈ చర్యలు మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 190(2) ప్రకారం తీసుకోబడినవి. వాహన యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి, శబ్ద కాలుష్యంతో ఏర్పడే ఆరోగ్య, పర్యావరణ సమస్యలు వివరించబడ్డాయి. చాలా మంది వాహనదారులు తమ పొరపాటును అంగీకరించి స్వచ్ఛందంగా హారన్స్, సైలెన్సర్లు అప్పగించారు.
ప్రజలందరికీ విజ్ఞప్తి:
తిరుపతి ట్రాఫిక్ పోలీసులు అన్ని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, శబ్ద కాలుష్యానికి కారణమయ్యే అధిక శబ్ద హారన్స్ మరియు సైలెన్సర్లను ఉపయోగించకుండా, నగర ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు సహకరించగలరని కోరుతున్నాము.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.