నారద వర్తమాన సమాచారం
పెట్రోలియం ఉత్పత్తులు, LPG, సహజ వాయువు సురక్షితమైన రోడ్డు రవాణాకు మార్గదర్శకాలు – సురక్షిత రవాణాకు కీలక చర్యలు
పల్నాడు జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల ప్రకారం, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో 06.08.2025 న జిల్లా పోలీస్ కార్యాలయ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకు యజమానులు, గ్యాస్ డీలర్లు సమావేశమయ్యారు. పెట్రోలియం ఉత్పత్తులు (HSD, LPG, సహజ వాయువు) రోడ్డు ద్వారా సురక్షితంగా రవాణా చేయడానికి తీసుకోవలసిన చర్యలు, మార్గదర్శకాలు తెలియజేయడం జరిగింది.
ఎస్పీ గారి ముఖ్య సూచనలు:
పెట్రోలియం ఉత్పత్తుల రవాణా కి సంబంధించిన చట్టబద్ధ నియమాలను కచ్చితంగా పాటించవలెను.
సంస్థలు ఎక్కువ దూరాలకు పెద్దమొత్తంలో రవాణాను తగ్గించాలి; ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు పరిశీలించాలి.
అత్యంత రద్దీ ప్రాంతాలు దాటేటప్పుడు ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలి.
ఎక్కువ దూరాల రవాణా సమయంలో డ్రైవర్ తో పాటు ప్రత్యామ్నాయ డ్రైవర్ ను కూడా ఏర్పాటు చేయాలి.
డ్రైవర్ల వైద్య ఫిట్నెస్ పత్రాలను ప్రయాణం ప్రారంభించే ముందు తటస్థంగా పరీక్షించాలి.
లోడ్ అన్ లోడ్ సమయంలో ట్రక్ డ్రైవర్లకు కనీస నిరీక్షణ సమయం కల్పించాలని సంస్థలు చర్యలు తీసుకోవాలి, తద్వారా అలసట తగ్గుతుంది.
పల్నాడు జిల్లాలో మొత్తం 35 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు, ఆ ప్రదేశాల్లో సురక్షిత చర్యలను అమలు చేయాలి.
పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల దగ్గర రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాలు విషయంలో అవగాహన కల్పించేందుకు గట్టిగా బోర్డ్స్ ఏర్పాటు చేయాలి.
మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా, వారికి ప్రమాదాల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలి.
పల్నాడు జిల్లా పోలీస్ శాఖ ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలు చేయించడానికి అన్ని అవకాశాలు వినియోగిస్తుంది. ప్రజా భద్రత, ప్రమాద నిరోధక చర్యలు పాటించడంలో పాల్గొనమని కోరుకుంటున్నాం.
సురక్షిత రోడ్డు రవాణా – సమాజ హితం
ఈ కార్యక్రమంలో BPC, IOCL, లీగల్ మెట్రాలజీ విభాగాల అధికారి, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, పెట్రోల్ బంకుల డీలర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. వారి సందేహాలు నివృత్తి చేయడంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టబడింది.
అనంతరం ఈ కార్యక్రమం కొరకు BPC,IOCL, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తరఫున హాజరు అయినటువంటి అధికారులు గ్యాస్ ఏజెన్సీ డీలర్లు మరియు పెట్రోల్ బంకు డీలర్లు అడిగిన సందేహాలను నివృత్తి చేసినారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడ్మిన్ ఎస్పీ JV. సంతోష్ , మహిళా పోలీస్ స్టేషన్/నరసరావుపేట సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పి M.వెంకట రమణ , ట్రాఫిక్ సిఐ Ch.లోకనాథం ,BPC పల్నాడు జిల్లా సేల్స్ ఆఫీసర్ చంద్రకాంత్ నాయక్ , IOCL పల్నాడు జిల్లా సేల్స్ ఆఫీసర్ సాయి ప్రకాష్ ,AMVI M.L. వంశీకృష్ణ , లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అల్లూరయ్య మరియు పోలీసు వారు హాజరు అయినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.