నారద వర్తమాన సమాచారం
కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నుంచి సి.ఎస్ వీడియో సమావేశం లో పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
నరసరావు పేట,
స్వర్ణ ఆంధ్ర పి-4 ఫౌండేషన్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎం.ఎస్.ఎం.ఇ పార్కులు ఏర్పాటు,ముఖ్యమైన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ, జిల్లా స్థాయి లాజిస్టిక్ ప్రణాళిక లు, జిల్లాల్లో పిపిపి విధానంలో ప్రాజెక్టులు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్,డాక్యుమెంట్ అప్లోడ్ తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పల్నాడు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఎరువుల కొరత,ఎం.ఎస్. ఎం.ఈ, పార్కులకు భూములు, పి.4 విధానం, భూ సంబంధిత అంశాల గురించి వివరణ ఇచ్చారు.
డి.ఎం.హెచ్.ఓ రవి, జిల్లా వ్యవసాయ శాఖ సీ.ఎం జగ్గారావు,రెవెన్యూ శాఖ,పి.4లకు సంబంధించి అధికారులు, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ నోడల్ అధికారి వెంకట్ రెడ్డి.,డీ.సి.హెచ్.ఎస్ ప్రసన్నాంబ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్. యువరాజ్,ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్,ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్,ఏపిఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్,సిఇఓ ఎంఎస్ఎంఇ విశ్వ,ప్రణాళికా శాఖ జెఎస్ అనంత శంకర్ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ గా రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.