నారద వర్తమాన సమాచారం
ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలి : జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.
జాతీయ చేనేత దినోత్సవం
నరసరావు పేట,
ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి శనివారం తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు.
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
చేనేత కళాకారులకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. జిల్లాలో 2,160 చేనేత కార్మికులు ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారన్నారు. మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు, మర మగ్గం ఉన్నవారికి 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, ముద్ర యోజన వంటి పథకాల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దశాబ్దాలుగా చేనేత రంగంలో సేవలు అందిస్తున్న పలువురిని సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యేతో కలిసి స్థానిక టౌన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత ఎక్స్ పో ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత మరియు వస్త్ర అధికారి రాఘవరావు, ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.