నారద వర్తమాన సమాచారం
మాదకద్రవ్యాల నిర్మూలన శక్తి యాప్ మరియు రోడ్డు భద్రత మొదలగు వాటిపై ఉపాధ్యాయులతో చర్చించిన :జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
మాదకద్రవ్యాల నిర్మూలన,శక్తి యాప్ వలన లాభాలు,రోడ్డు భద్రత నియమాలు మొదలగు వాటి పై కాలేజీ ప్రధానోపాధ్యాయులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావు ఐపిఎస్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు పల్నాడు జిల్లా వ్యాప్తంగా హాజరు అయిన కాలేజి ప్రధానోపాధ్యాయులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
మాదక ద్రవ్యాల వినియోగం – మానవ మనుగడకు హానికరం.
ఈ కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన పెంపొందించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసి వారి సేవలను వినియోగించుకొననున్నట్లు తెలిపారు.
కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన ఉండాలని, ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని,వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారని, వారు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి తమ వ్యసనాలను తీర్చుకోవడానికి నేర పవృత్తి వైపు మళ్ళి నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని, కావున తల్లిదండ్రులు – ఉపాధ్యాయులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 370 ఈగల్ క్లబ్స్ ను ఏర్పాటు చేసినట్లు, కావున తమ తమ పరిసరాలలో గంజాయి,మాదక ద్రవ్యాలను ఎవరైనా వినియోగించిన లేదా విక్రయించిన సదరు సమాచారాన్ని దగ్గరలోని పోలీస్ వారికి గాని, 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని తెలిపారు.
శక్తి యాప్ ఉపయోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాలికల మహిళల భద్రత కొరకు శక్తి యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈ యాప్ మహిళలు భద్రత కొరకు ప్రత్యేకంగా రూపొందించినట్లు, అత్యవసర సమయంలో మహిళలు శక్తి SOS యాప్ వినియోగం గురించి తెలియజేశారు.
శక్తి SOS యాప్ యొక్క ఉపయోగాలు
బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ గురించి SOS యాప్ నందు తెలియపర్చవచ్చని తెలిపారు.
శక్తి యాప్ ఉపయోగాల గురించి బాలికలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకు శక్తి బృందాలు స్కూలు, కాలేజీలలో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
రోడ్డు భద్రత నియమాలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఆగస్టు నెల మొత్తం ఎన్ఫోర్స్ మెంట్ డ్రైవ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హై స్పీడ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుత సమాజంలో వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.
మైనర్లు వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నట్లు,కావున వారికి ఎట్టి పరిస్థితులలో వాహనాలు ఇచ్చి ప్రోత్సహించరాదని తెలిపారు.
ప్రస్తుత కాలంలో ప్రమాదాలు జరిగి చనిపోతున్న వారిలో ఎక్కువమంది హెల్మెట్ వాడకపోవడమే అని తెలిపారు.
ఇవే కాకుండా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తీసుకోవలసినటువంటి చర్యలు, వారికి తెలియజేయవలసిన సూచనల గురించి వివరించారు.
కాలేజి ప్రధానోపాధ్యాయులతో కలిసి పోలీసు అధికారులు డ్రగ్స్ వద్దు బ్రో ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడ్మిన్ ఎస్పీ J.V.సంతోష్ , మహిళా పోలీస్ స్టేషన్/ నరసరావుపేట సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పి
M.వెంకటరమణ , శక్తి టీం మహిళా ఎస్సైలు, సిబ్బంది మరియు పల్నాడు జిల్లా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ D.సునీత DIEO
M.నీలావతి దేవి మరియు జిల్లాలోని కళాశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.