నారద వర్తమాన సమాచారం
శంకర భారతీపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
స్థానిక శంకర భారతీపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు దత్తత తీసుకున్నారు. కలెక్టరేట్ కు సమీపంలో ఉన్న పాఠశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తానని, ప్రతి నెలా చదువులో వెనకబడిన విద్యార్థుల ప్రమాణాలను పరిశీలిస్తానన్నారు.
ఈ సందర్భంగా శంకర భారతీపురం పాఠశాలను గురువారం ఉదయం ఆయన సందర్శించారు. సిలబస్ పూర్తి చేయడం మీద కంటే విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించడం, ప్రతి విద్యార్థీ ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేలా చేయడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. వారంలో రెండు సార్లు డిప్యూటీ డీఈవో పాఠశాలను సందర్శించి బోధనా పద్ధతులను సమీక్ష చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, డిప్యూటీ డీఈవో సుబానీ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.