నారద వర్తమానసమాచారం
ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది.నూతన జిల్లా అధ్యక్షునిగా పట్నాల సాయికుమార్,ప్రధాన కార్యదర్శిగా మహేష్ వరదలను గురువారం స్థానిక బ్రహ్మానందం స్టేడియం నందు జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం నందు సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నూతన కమిటీలను ఏర్పాటు చేసి త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా,నియోజకవర్గ సభ్యులు మామిడాల శ్రీనివాస్,దాసరి వెంకట పూర్ణా నరసింహరావు, k.v.s.r కోటేశ్వరరావు,మధిర కిషోర్,వేముల రాజేష్ వెంకట నాగ సాయి, సయ్యద్.కరీముల్లా,వై.నాగ మల్లేశ్వరరావు,చల్లారవి, శ్రీనివాస్,మురళీ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









