నారద వర్తమాన సమాచారం
ఐశ్వర్యాన్ని ఆశించరు అభిమానాన్ని మాత్రమే కోరుకుంటారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ద్వారా వచ్చిన ఫిర్యాదులపై
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వంటి బలహీన వర్గాల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మరియు వారికి న్యాయం చేకూర్చాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల ప్రకారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన వృద్ధుల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించారు.
బాధిత వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు.
వృద్ధులు ఎవరి ద్వారా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని సవివరంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
వృద్ధులకు భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ వినూత్న విధానం వృద్ధుల లో భద్రత భావాన్ని పెంచి, పోలీసులపై నమ్మకాన్ని మరింత బలపడుతుంది అని తెలిపారు.ది.04.08.2025 వ తేదీ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నందు మొత్తం 25 వృద్ధుల ఫిర్యాదులు అందగా వాటిలో 19 ఫిర్యాదులు పరిష్కారం కాగా 06 ఫిర్యాదులు విచారణలో ఉన్నట్లు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.