నారద వర్తమాన సమాచారం
రాఖీ పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క.
రాష్ట్ర రాజధానిలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క
“సోదరి సీతక్క” కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు
హైదరాబాద్, ఆగస్టు 9, 2025: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రాఖీ పండుగను రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాదులో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరి చేతికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు మంత్రి సీతక్క. నాయకులు తమ సొంత సోదరిగా భావించి సీతక్కను ఆప్యాయంగా ఆహ్వానించారు. రాఖీ కట్టించుకుంటూ “సోదరి సీతక్క” అంటూ ఆత్మీయంగా పలకరించి, ఆశీర్వాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
సీతక్క రాకతో సీఎం, మంత్రుల నివాసాలు సోదర భావంతో నిండిపోగా, పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్బంగా సీతక్క “రాఖీ పండుగ మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ఇలాంటి సోదర భావం, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఉదయం తన నివాసమైన ప్రజాభవన్‌కు విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కి మంత్రి సీతక్క రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసం కి విచ్చేసిన నాయకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి సీతక్క రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వెలుగొందాలని ఆమె ఆకాంక్షించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.